దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

ఉరవకొండ: మంత్రి కేశవ్‌కు దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా టీడీపీ అభ్యర్థులతో పోటీ చేయించాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి సవాల్‌ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లకుండా.. ఎందుకంతలా భయపడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు చేయిస్తున్నారంటూ నిలదీశారు. ఇప్పటికై నా శిఖండి రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. సోమవారం ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్వ మాట్లాడారు. మంత్రి స్వగ్రామం పెద్దకౌకుంట్లలో ఎస్సీలకు రిజర్వు అయిన రెండు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పట్టణ సీఐ మహానంది ద్వారా కిడ్నాప్‌ చేయించి, భయభ్రాంతులకు గురి చేయించి నామినేషన్‌ వేయకుండా చేశారన్నారు. అలా రెండు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ తరఫున కై వసం చేసుకున్నారన్నారు. సొంత గ్రామంలో కూడా అభ్యర్థులను గెలిపించుకునే దమ్ము మంత్రికి లేదని ఎద్దేవా చేశారు. ఉరవకొండ ఎంపీటీసీ–1 స్థానానికి నామినేషన్‌ వేసిన తమ పార్టీ అభ్యర్థులు పామిడి జాకీర్‌, బెలగల్‌ షమ్ము వ్యాపారాలపై జీఎస్టీ అధికారుల చేత దాడులు చేయించి, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయించి.. వారు ఉపసంహరించుకునేలా చేశారని, మరో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసిన ఇర్ఫాన్‌, ముంతాజ్‌ బేగంలను కూడా బెదిరించి విత్‌ డ్రా చేయించారన్నారు. చివరకు మరో అభ్యర్థి పామిడి శెట్టి సుధ నామినేషన్‌ వేసి.. టీడీపీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లి తలదాచుకుంటే.. అక్కడకు గూండాలను పంపి ఉరవకొండకు పిలుచుకొస్తున్నారన్నారు. విధ్వంస కాండపై అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు వేసినా టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులు, మైనార్టీలు రాజకీయంగా ఎదగడం మంత్రికి ఏమాత్రమూ ఇష్టం లేదని ఇట్టే తెలిసిపోతోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ముత్తులూరు అశోక్‌, ఏసీ ఎర్రిస్వామి, ఈడిగ ప్రసాద్‌, సింగాడి తిప్పయ్య, బసవరాజు, జోగి వెంకటేష్‌ పాల్గొన్నారు.

దక్షిణ భారత

టీటీ పోటీలకు ఆరుష్‌

అనంతపురం సిటీ: విశాఖపట్నంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో ఈ నెల 30 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థి యూ.ఎస్‌. ఆరుష్‌ శ్రీవత్స ఎంపికయ్యాడు. డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తరఫున ప్రథమ స్థానంలో ఎంపికై న ఆరుష్‌.. దక్షిణ భారత టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయశ్రీ సోమవారం తన చాంబర్‌లో ఆరుష్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ నరసింహ నాయక్‌, ఆరుష్‌ తండ్రి, ప్రముఖ న్యాయవాది యు.ఎస్‌. మధుసూదన శర్మ, స్పోర్ట్స్‌ కమిటీ సభ్యుడు డా. పునర్జీవన్‌ కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. సునీల్‌, డా.బి.ఆంజనేయబాబు నాయక్‌ పాల్గొన్నారు.

శిఖండి రాజకీయాలు మానుకోండి

మంత్రి కేశవ్‌కు వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ హితవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement