తాడిపత్రి రూరల్: పట్టణంలోని శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు భూదేవి, శ్రీదేవి సమేత వేంకటరమణుడు పలు వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో దేవాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. వివిధ రకాల పూలమాలలతో దేవాలయాన్ని సుందరంగా తీర్చదిద్దే ఏర్పాట్లలో ఆలయ కమిటీ, సిబ్బంది నిమగ్నమయ్యారు.
● 19న సాయంత్రం సేవాధిపతి ఉత్సవం
● 20న సోమవారం ఉదయం ధ్వజారోహణం మధ్యాహ్నం శమీ దర్శనం, సాయంత్రం శేష వాహన సేవ
● 21న ఉదయం సింహ వాహనం, సాయంత్రం హంస వాహనం
● 22న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
● 23న మోహిని వాహనం, సాయంత్రం గరుడ వాహనం
● 24న కాళింగ మర్ధన అలంకరణ, సాయంత్రం హనుమద్ వాహనం
● 25న ఉదయం వేణుగోపాలస్వామి అలంకరణ, సాయంత్రం గజ వాహనం
● 26న ఉదయం స్వామి వారి తిరుకళ్యాణం, మధ్యాహ్నం విందుభోజనం, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి వారి రథోత్సవం
● 27న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం అశ్వవాహనం
● అక్టోబరు 9న వసంతోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ద్వాదశ అరాధన, రాత్రి ధ్వజావరోహణ, కుంభప్రోక్షణ, భట్టర్ మర్యాద కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ముస్తాబైన చింతల వెంకటరమణుడి ఆలయం
23న గరుడ వాహన సేవ,
26న కల్యాణం, రథోత్సవం
బ్రహ్మోత్సవాల వివరాలు..


