కనులపండువగా సిడిమాను ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా సిడిమాను ఉత్సవం

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

బెళుగుప్ప: మండలంలోని బెళుగుప్పతండా గ్రామంలో బుధవారం గౌరసంద్రం మారెమ్మ జాతరను పురస్కరించుకొని కనుల పండువగా సిడిమాను ఉత్సవం నిర్వహించారు. ముందుగా అర్చకుడు చంద్రానాయక్‌ మారెమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులతో కలసి గ్రామోత్సవంతో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారి పూనకంతో అర్చకుడు చంద్రానాయక్‌ను సిడిమాను ఉత్సవంలో భాగంగా సిడిమాను చుట్టూ తిరుగుతూ భక్తులపై పూలు చల్లి ఆశీర్వదించారు. భక్తిశ్రద్ధలతో జరిగే కార్యక్రమం కావడంతో పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.

యువజనోత్సవాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం కల్చరల్‌: జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెలలో జరగనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆన్‌సెట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవిశంకర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతకు జానపద నృత్యం, జానపద గీతం, పెయింటింగ్‌, వీధి నాటకం, కవితా రచన పోటీలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలు రాష్ట్రస్థాయి, ఆపైన జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు వివరాలతో ఈనెల 30లోపు జిల్లా కేంద్రంలోని ఆన్‌సెట్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9959517370, 9010786106 నంబర్లలో సంప్రదించాలన్నారు.

జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలి

గుత్తి: 2027లో జరగబోవు పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఆయూబ్‌ హుసేన్‌ తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్లు, బూత్‌ రూమ్స్‌ పరిపశీలించారు. ఉపాధ్యాయులు బోధనను దగ్గరుండి పరిశీలించారు. వందశాతం ఉత్తీర్ణత, 90 శాతం విద్యార్థులు హాజరు లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ పని చేయాలన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ రవి నాయక్‌, హెచ్‌ఎం సుంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ఉరవకొండ రూరల్‌: కోనాపురం సమీపంలో బుధవారం అనంతపురం – బళ్లారి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను భారత్‌ గ్యాస్‌ సిలిండర్ల బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు కాలు విరిగింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఉన్న ఫలంగా కుడి వైపు వాహనాన్ని తిప్పాడు. దీంతో బొలెరో వాహనం నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో ఏదైనా రాపిడి జరిగి సిలిండర్లు పేలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు తెలిపారు.

మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి

రాయదుర్గంటౌన్‌: మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి సాధ్యమని ఆర్డీటీ మహిళా సాధికారత విభాగం డైరెక్టర్‌ విశా ఫెర్రర్‌ అన్నారు. బుధవారం గుమ్మఘట్ట మండలశాఖ అక్షయ మహిళా పొదుపు సహకార సంఘం సొసైటీ బ్యాంకును ఆమె ప్రారంభించారు. తొలుత పట్టణంలోని 17వ వార్డు పరిధిలోని కెనరా బ్యాంకు వెనుక వీధిలో 650 మంది సభ్యులున్న సొసైటీ బ్యాంకు భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం సీతారామాంజనేయ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన మహిళా సాధికార సమావేశంలో పొదుపు మహిళలను విశా ఫెర్రర్‌ మాట్లాడారు. ఉరవకొండ ఆర్డీడీ ఆర్డీ కృష్ణవేణి, ఏపీసీలు సుకన్య, సుధాకర్‌, వెంకటేశు లు, కోఆర్డినేటర్‌ తిప్పన్న, ఎర్రిస్వామి, షేక్‌న్‌బీ, ఎఫ్‌సీ ఇందిరా ప్రసన్న, ఆర్‌ఈ చంద్రశేఖర్‌, ఇంజినీర్‌ శ్రీలక్ష్మి, అకౌంటెంట్‌ అరుణ, అవుట్‌రీజ్‌ వర్కర్‌ అరుణకుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement