రాప్తాడు రూరల్: రైతాంగాన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా ష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం టవర్‌క్లాక్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న కరువుదీక్షలకు బుధవారం ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ప్రజా సమస్యలపై సీపీఐ చేపట్టే ప్రతి ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. అందరికీ ఏకై క శత్రువు కరువేనని, అన్నంపెట్టే రైతులకు ఆపద వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా ఏకమై రైతు కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.
కరువుపై కనీసం ప్రకటన లేదు
ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేశారు, కరువు ప్రభావంతో రైతులు ఏ మేరకు నష్టపోయారన్న వివరాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యాష్‌బోర్డు ముందు ఉన్నప్పటికీ కరువుపై కనీసం ప్రకటన చేయడం లేదని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. తుంగభద్ర డ్యాంలో నీళ్లున్నా పీఏబీఆర్ కుడికాలువకు ఇవ్వడం లేదన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అనేక వేదికలపై వైఎస్సార్‌సీపీ గళం విప్పుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నీరు లేక డ్యాం కింద వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చామని, దీంతో అనంతపురం నగరం వరకు భూగర్భజలాలు పెరిగి వందలాది గ్రామాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేసి రైతుల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు.
కేసులకు భయపడం
సీఎం జిల్లాకు రావడం లేదని, మంత్రి లోకేష్ విగ్రహావిష్కరణలు చేసి నాలుగు మాటలు చెప్పి వెళ్లారని, కరువు, రైతు, నీళ్ల గురించి మాట్లాడలేదని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ప్రజల్లోకి వెళ్తున్న తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 26 నెలల్లో తనపైనా, తన సోదరులపైనా 22 కేసులు పెట్టారని తెలిపారు. ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ కరువని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఏడాది క్రితమే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు అండగా పోరాడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, మామిళ్లపల్లి ఆమర్‌నాథ్‌రెడ్డి, బండి పవన్‌కుమార్, దుగుమర్రి గోవిందరెడ్డి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, బోయ శేఖర్, విశ్వనాథ్‌రెడ్డి, హంపాపురం సింగారప్ప, సునీల్‌దత్తరెడ్డి, బండా అంజియాదవ్ ఉన్నారు.
కరువుపై ప్రభుత్వం కనీసం ప్రకటన చేయడం లేదు
తుంగభద్రలో నీళ్లున్నా పీఏబీఆర్‌కు ఎందుకు ఇవ్వరు?
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


