రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌

అనంతపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చంద్ర బాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ పాలనతో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. బుధవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మంత్రి లోకేష్‌ పదే పదే రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నామని చెప్తున్నారన్నారు.

విజయవాడలో డీఎస్సీ, నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన యువతపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తీరా నోటిఫికేషన్‌ వచ్చేసరికి కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఏడేసి పోస్టులే కేటాయించి నిరుద్యోగ యువతను దారుణంగా వంచించారని మండిపడ్డారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే రౌడీ షీట్లు తెరుస్తున్నారని, బైండోవర్‌ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి.. రాజకీయ కక్షసాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు.

నైపుణ్య శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన–4.0 (పీఎంకేవీవై) ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రాయపరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్‌ డెవలపర్‌–వెబ్‌ అండ్‌ మొబైల్‌ కోర్సుకు 20 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు, ఎలక్ట్రిక్‌ వాహనాల సేవా సాంకేతిక నిపుణుడు–ద్విచక్ర వాహనాల కోర్సుకు 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. ఈ శిక్షణ ఉద్యోగం, స్వయం ఉపాధికి ఉపయోగపడుతుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 26లోపు అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌: 80967 63970లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement