● డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు: ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యహరించాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా సూచించారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో 12 మంది ఉద్యోగులు ప్రమాదాలు నివారించడంలో ప్రతిభ కనబరిచి మ్యాన్ అఫ్ మంత్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరికి డీఆర్‌ఎం కార్యాలయంలోని తుంగభద్ర ఛాంబర్‌లో డీఆర్‌ఎం సీఎస్ గుప్తా చేతుల మీదుగా మంగళవారం ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో సీనియర్ టెక్నిషియన్ జీ.నాగరాజు (నందలూరు), కీమ్యాన్‌లు తరుణ్ దహల్ (ఓబుళవారిపల్లి), నక్క శ్రీకాంత్ (బేతంచెర్ల), స్టేషన్ మాస్టర్ బద్రి ప్రసాద్ (రాయలచెరువు), ట్రైన్ మేనేజర్లు ఖసీమ్ (ఎర్రగుంట్ల), లెనిన్ బాబు (నందలూరు), ఎర్రగుంట్లకు చెందిన ట్రైనీ మేనేజర్లు ఆర్‌కే గుప్తా, మైకేల్‌బాబు, సీనియర్ టెక్నిషియన్ జీ.వెంకటేష్ (కడప), లోకోపైలట్ ఎన్.రామ్‌ప్రసాద్ (తిరుపతి), సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్ భూపేంద్రకుమార్ (తిరుపతి), లోకోపైలట్ ఎన్‌వీ సునీ (తిరుపతి)లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శివప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతిభను వెలికితీసేందుకే ట్యాలెంట్ హంట్
ఆత్మకూరు: గ్రామీణుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ట్యాలెంట్ హంట్ ఉపయుక్తంగా ఉంటుందని ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్డీటీ క్రీడా మైదానంలో అండర్ – 14, అండర్– 18 క్రికెట్ ట్యాలెంట్ హంట్ నిర్వహించారు. మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియకు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో ఆర్డీటీ ఏపీసీ కృష్ణయ్య, ఆర్డీటీ కోచ్ హరినాథ్‌రెడ్డి, ప్రదీప్, ఎస్‌జే షాకీర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీటీ కోఆర్డినేటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు
వజ్రకరూరు: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కుక్కదాడిలో ఆరుగురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన శివ, ప్రభాకర్, అల్లబకాస్, బండయ్య, నవీన్ మరో వ్యక్తిపై కుక్క దాడి చేసింది. గాయపడిన వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.


