దాహార్తి తీర్చి.. ఆదర్శంగా నిలిచి.. | - | Sakshi
Sakshi News home page

దాహార్తి తీర్చి.. ఆదర్శంగా నిలిచి..

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

శెట్టూరు: తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి చలించిపోయిన రైతు తన సొంత డబ్బుతో బోరు బావి తవ్వించి దాహార్తి తీర్చాడు. వివరాలు.. మండ లంలోని చిన్నంపల్లిలో కొంతకాలంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఫిర్యాదు చేసినా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించలేదు. దీంతో గ్రామంలోని చిన్నకారు రైతు మాల దేవక ఈరన్న మంగళవారం బోరు బావి తవ్వించాడు. రైతు సంకల్పానికి ప్రకృతి తోడయ్యింది. బోరుబావిలో రెండు ఇంచులకుపైగా నీరు పడింది. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నలుగురికి ఆదర్శంగా నిలిచిన కర్షకుడు ఈరన్నను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement