ఇంటి ఎదుట వివాహిత ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఇంటి ఎదుట వివాహిత ధర్నా

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

అనంతపురం సెంట్రల్‌: కుటుంబ సమస్యలతో ఓ వివాహితపై భర్త, వారి బంధువులు దాడికి పాల్పడ్డారని బాధితురాలు రుబీనా ఆరోపించారు. రుద్రం పేటలో నివాసం ఉంటున్న రుబీనా గత కొంతకాలంగా భర్త షెక్షావలితో విభేదించి ఒక్కరే ఉంటున్నారు. దిశ పోలీసుస్టేషన్‌లో కేసు విచారణలో ఉంది. మంగళవారం సాయంత్రం భర్త తరఫున కొంతమంది వచ్చి తనపై దాడి చేయడమేగాక, ఇంటి నుంచి బయటకు పంపి తాళం వేసినట్లు తెలుపుతూ బాధితురాలు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కొంతసేపటికి ఆమె కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించా రు. నాలుగో పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి తిరిగి ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయ పరంగా విచారించి సదరు ఇల్లు ఎవరికి చెందుతుందనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని నాలుగో పట్టణ పోలీసులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement