‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

గార్లదిన్నె: అందరూ ఐకమత్యంతో సాగి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మర్తాడు క్రాస్‌ టీ కన్వెన్షన్‌ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి పార్టీ శ్రేణులకు ‘అనంత’ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. అందరూ కలసికట్టుగా కష్ట పడి పనిచేయాలన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంపై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది మన ప్రభుత్వమేని స్పష్టం చేశారు. ప్రజలు కరువు బారిన పడినా ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జిల్లా రైతులు ఈ ఖరీఫ్‌లో 5.75 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారన్నారు. కరువు కారణంగా పశు సంపదను కాపాడుకోలేకపోతున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలో లక్షల ఎకరాల్లో చీనీ చెట్లు ఉన్నాయని, కాలువలకు నీరు వదిలితే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. రాయలసీమకు నీరు రాకుండా చంద్రబాబు, లోకేష్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని, శ్రీశైలం నీటిని కోస్తా ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. నీటి కోసం రైతులు, ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు.

గెలుపు మనదే: శైలజానాథ్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో పోటీ చేయబోతున్నామని, అన్ని చోట్లా గెలుపొందుతామని మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కూటమి నాయకులు వైఎస్‌ జగన్‌ ఫొటో తీసివేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఎన్నికల్లో సత్తా చాటి, మళ్లీ అదే చోట వైఎస్‌ జగన్‌ నిలువెత్తు ఫొటో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే అన్ని మండలాలకూ నీళ్లు వచ్చేవన్నారు. జగన్‌ హయాంలో వర్షాలు సకాలంలో కురిసి, పంటలు సమృద్ధిగా పండాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 29న నీటి కోసం మిడ్‌ పెన్నార్‌ డ్యాం వద్ద ఆందోళన కార్యక్రమం తలపెట్టామని, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం ఉత్తిదేనని తేలిందని, ఇప్పటికై నా వారు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

ఊరూరా బెల్టుషాపులే..

పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో అర్హులందరికీ పథకాలు అందాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఊరూరా బెల్టుషాపులు వెలిశాయన్నారు. టీచర్‌ పోస్టులను అనర్హులకు కట్టబెట్టారన్నారు. గ్రామాల్లో తాగు, సాగు నీటి కోసం ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబును వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు చేసి రైతులకు రూ.3.32 వేల కోట్లు ఇచ్చారన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేటతెల్లమైన నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పడంతో పాటు తప్పుడు కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మండల కన్వీనర్‌ ఎల్లారెడ్డి, పంచాయతీరాజ్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సుధాకర్‌ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చలన్న, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బూత్‌ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఓబి రెడ్డి, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లారెడ్డి, కురబ సంఘం ఉపాధ్యక్షుడు అట్టేశీన, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి నారాయణ, పణీంద్ర, చీమల శీన, సుంకిరెడ్డి, ఆదినారాయణ, దేవ, జగన్‌, లక్ష్మిదేవి, పద్మావతి, సుమలత తదితరులు పాల్గొన్నారు.

వచ్చేది మన ప్రభుత్వమే

రాయలసీమకు చంద్రబాబు,

లోకేష్‌ తీవ్ర అన్యాయం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement