టైరు మారుస్తుండగా ముంచుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

టైరు మారుస్తుండగా ముంచుకొచ్చిన మృత్యువు

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

తాడిపత్రి రూరల్‌: స్థానిక పులిప్రొద్డుటూరు రహదారిపై వ్యాన్‌ టైరు మారుస్తుండగా.. పాల వ్యాన్‌ రూపంలో మృత్యువు ముంచుకొచ్చి డ్రైవర్‌ ఎజ్జాన్‌బాష (46) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అప్‌గ్రేడ్‌సీఐ నారాయణరెడ్డి వివరాల మేరకు.. వైఎస్సార్‌ కడపజిల్లా ఖాజీపేట మండలం సర్వర్‌ఖాన్‌పేటకు చెందిన ఎజ్జాన్‌బాష మినీవ్యాన్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన షేక్‌ఖాజా పొగాకు సరుకును బళ్లారికి తరలించేందుకు మినీ వ్యాన్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు. దీంతో శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి బయల్దేరారు. తెల్లవారుజామున పులిపొద్దుటూరు వద్ద రాగానే మినీవ్యాన్‌ టైరు పగిలిపోయింది. దీంతో వాహనాన్ని రోడ్డువైపు ఆపి ఇండికేటర్లు వేసి ఎజ్జాన్‌బాషా టైరు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో గుత్తివైపు నుంచి వచ్చిన శ్రీనిధి పాలడెయిరీ గూడ్స్‌ వాహనం వేగంగా వచ్చి మినీ వ్యాన్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఎజ్జాన్‌బాషాపై గూడ్స్‌ వాహనం వెనుక చక్రాలు ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో పక్కనే ఉన్న పొగాకు రైతు షేక్‌ఖాజాకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎజ్జాన్‌బాష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు హబీబుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

తెల్లవారుజామున దొంగతనాలు..

సాయంత్రానికి కటకటాలు

అనంతపురం సెంట్రల్‌: తెల్లవారుజామున మూడిళ్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు సాయంత్రానికల్లా కటాకటాల వెనక్కి పంపించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ తిరుపాల్‌ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని బోయగేరిలో ఆదివారం తెల్లవారుజామున హరికిరణ్‌ కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా దొంగ చొరబడ్డాడు. హఠాత్తుగా నిద్రలేచిన వారిని ఇనుపరాడ్డుతో బెదిరించి హరికిరణ్‌ భార్య మెడలోని బంగారు తాళిబొట్టు గొలుసు, సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. అలాగే ఎదురుగా ఉంటున్న వినేష్‌ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్‌, నాగరాజు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రాప్తాడు మండలం చిన్మయనగర్‌కు చెందిన కటిక సాయిప్రసాద్‌ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. ‘ఎన్‌న్‌టీఆర్‌ మార్గ్‌’లో ఉన్న అతన్ని అరెస్ట్‌ చేశారు. దొంగతనం చేసిన వస్తువులన్నీ రికవరీ చేశారు.

గూడ్స్‌ వాహనం ఢీకొని వ్యాన్‌ డ్రైవర్‌ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement