నేడు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు సెల్‌: 8977716661 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్‌ చేసే వినియోగదారులు తమ విద్యుత్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ..

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు ఫోన్‌ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

పింఛన్లకు

దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం టౌన్‌: ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజా ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 16వ తేదీలోపు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులపై విచారణ చేపట్టి అర్హత ఉన్న వారి వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

పది గొర్రెల మృతి

విడపనకల్లు: రోడ్డు ప్రమాదంలో పది గొర్రెలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని మాళాపురం సమీపంలో 42వ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకలోని బళ్లారి జిల్లా యాళపి గ్రామానికి చెందిన పెద్దన్న గొర్రెలను తరలిస్తుండగా.. అనంతపురం వైపు నుంచి బళ్లారికి వెళ్లే ఓ పేపర్‌ వ్యాన్‌ అతి వేగంతో వెళ్తూ జీవాలను ఢీకొట్టింది. ఘటనలో పది గొర్రెలు అక్కడికక్కడికే మృతి చెందాయి. దాదాపు రూ.రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు గొర్రెల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

శెట్టూరు: మండలంలోని కై రేవు గ్రామంలో శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం రాత్రి కై రేవులో వీధినాటకాన్ని ప్రదర్శించారు. ఇదే అదునుగా భావించిన దుండుగులు ఆలయంలోకి చొరబడి సుమారు 60 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అర్చకులు గుర్తించి గ్రామస్తుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుమన్‌ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement