అనంతపురం: జిల్లా స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ –2026 పోటీల్లో భాగంగా తొలిరోజు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగిన ఖోఖోలో చిన్నహోతూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు, వాలీబాల్లో బూదగవి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు విజయం సాధించారు. ఖోఖో, వాలీబాల్ రన్నర్స్‌గా వడియంపేటలోని కేశవరెడ్డి స్కూల్ నిలిచింది. అలాగే బాస్కెట్‌బాల్‌లో కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు విజయం సాధించగా, రన్నర్స్‌గా ఉరవకొండలోని వివేకానంద ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. వివిధ కేటగిరిల్లో సాగిన జూడో పోటీల్లో బంగారు పతకాలను ఉరవకొండకు చెందిన సుగంధం, కిషోర్ మణికంఠ, చంద్రశేఖర్ నాయక్, వశీకర్, అనంతపురం విద్యార్థి అబ్దుల్ ఖాదర్, శింగనమల విద్యార్థి రిషివర్దన్ దక్కించుకోగా, వెండి పతకాలను చక్రి (అనంతపురం), ఖలీద్ బాషా, రాఘవేంద్రనాయక్, సూర్యనారాయణ (శింగనమల), ఎండీ ఖలీల్ (అనంతపురం), శంకర్, విజయ్‌కుమార్ (ఉరవకొండ), కాంస్య పతకాలను పురుషోత్తం, రంజిత్‌కుమార్ (శింగనమల), కుళ్లాయిస్వామి (అనంతపురం), హేమంత్ నాయక్, విశాల్ (కళ్యాణదుర్గం), అభిలాష్ (ఉరవకొండ), కై వసం చేసుకున్నారు. ఫుట్‌బాల్ పోటీల్లో రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి.


