కణేకల్లు: మ్యాథ్స్‌లో వెనుకబడిన విద్యార్థులు మెరుగ్గా రాణించేలా నిరంతరం ప్రోత్సహిస్తూ ఇన్‌స్పై రింగ్ టీచర్‌గా శ్రీనివాసరావు పేరు పొందారు. కణేకల్లు మండలం హనకనహళ్ జెడ్పీ హైస్కూల్ మ్యాథ్స్ టీచర్‌గా శ్రీనివాసరావు రాణించారు. లెక్కలంటే విద్యార్థుల్లో ఉండే భయం, ఆందోళనను తొలగించారు. విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులతో మాట్లాడి రెగ్యులర్‌గా వచ్చేలా చేసేవారు. రాత్రి పూట స్కూల్‌లోనే బస చేసి ప్రత్యేక తరగతులు చెప్పి లెక్కల్లో రాణించేలా చేశారు. మ్యాథ్స్‌లో మెరిట్ సాధించే విద్యార్థులకు బహుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. నిరంతర ప్రోత్సాహమే ఉత్తమ టీచర్ అవార్డు వచ్చేలా చేసింది.


