అనంతపురం అర్బన్: డిమాండ్ల సాధన ధ్యేయంగా ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యచరణ ప్రకటించి మొదటి దశ చేపట్టింది. ఇందులో భాగంగా సిద్ధం... సిద్ధం... ఉద్యమానికి సంసిద్ధం నినాదంతో ఈనెల 1న నాయకులు, ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ జె.విష్ణుచరణ్‌కు ఉద్యమ నోటీసును అందజేశారు. అదే రోజు నుంచి నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. ‘ఉద్యోగితో... చేయి చేయి కలిపి’ కార్యక్రమం పేరిట ప్రభుత్వ శాఖల్లో ఉద్యమ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో ప్రధాన సంఘం ఏపీ జేఏసీ పోరుబాటకు సిద్ధమైంది. శనివారం రాష్ట్ర ఏపీ జేఏసీ సమావేశమై రూపొందించే కార్యాచరణ మేరకు జిల్లాలో ఉద్యమాలు నిర్వహిస్తామని నాయకులు చెబుతున్నారు.
అన్నీ తప్పుడు లెక్కలే...
అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాలు, పెన్షన్‌కు అయ్యే ఖరచు 47.64 శాతంగా ఉంటే... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఖర్చు 2024–25లో 98 శాతం, 25–26లో 94 శాతంగా పేర్కొంటూ శ్వేత పత్రం పేరుతో వాస్తవ విరుద్ధ గణాంకాలు ప్రకటించిందని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
హక్కుల సాధనే ధ్యేయంగా
పిడికిలి బిగిస్తున్న ఉద్యోగులు
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న నాయకులు
ఉద్యోగులందరినీ భాగస్వాముల్ని చేసేపనిలో ప్రధాన సంఘాలు
కార్యాచరణ ప్రారంభించిన ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ


