● 108 వాహనం లేక తీవ్ర ఇబ్బందులు
ఉరవకొండ: మండల పరిధిలో చిన్నమూస్టూరు వద్ద ద్విచక్ర వాహనం టైరు పగలడంతో అదుపు తప్పిన ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాలమేరకు.. కోనాపురానికి చెందిన ఉలుతప్ప, శకుంతలమ్మ ఉరవకొండ నుంచి తిరిగి వారి స్వగ్రామానికి వెళ్తున్నారు. చిన్నమూస్టూరు వద్ద ద్విచక్ర వాహనం టైరు పగలడంతో వాహనం అదుపు తప్పింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడగా 108కు ఫోన్ చేశారు. ఉరవకొండకు వాహనం లేదని మరోచోటి నుంచి వాహనం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడంతో గత్యంతం లేక ఆటోలో వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు వెళ్లాలని వైద్యలు సూచించగా.. 108 అందుబాటులో లేకపోవడంతో రూ.6 వేలు బాడుగ చెల్లించి ప్రైవేటు అంబులెన్స్‌లో అనంతపురంకు వెళ్లారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీసం 108 వాహనం కూడా అందుబాటులేకపోవడం సిగ్గుచేటని ప్రజలు మండిపడుతున్నారు.


