ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటినే అడుతున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించలేదు. ఐఆర్ ప్రకటించలేదు. ఐడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఇతర డిమాండ్లను అడుగుతుంటే ఉద్యోగులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హక్కుల సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము.
– ఆర్.ఎన్.దివాకర్‌రావు, జిల్లా చైర్మన్,
ఏపీ జేఏసీ అమరావతి


