రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం వీఎన్‌ఆర్ కాలనీలోని ఆరాధ్య హోమ్స్‌కు వెళ్లే మార్గంలో గుజరి షాపు వద్ద జరిగిన మఠం భరద్వాజ్ (33) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాళ్యం శ్రీహరి, పాళ్యం చందన, అనంతపురం రూరల్ పామురాయికి చెందిన దాసంద్రం అనిల్‌కుమార్, తరిమెల పంచాయతీ చింతమేకలపల్లికి చెందిన దండు మునికుమార్, గురుగుంట్లకు చెందిన వరుకూటి రామాంజనేయులు, బెళుగుప్పకు చెందిన అక్కిశెట్టి తులసిలను గురువారం అరెస్టు చేశారు. వివరాలను సీఐ శ్రీకాంత్‌యాదవ్ మీడియాకు వెల్లడించారు.
కిడ్నాప్ కేసు పెట్టినా...
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భరద్వాజ్‌కు టిఫిన్ సెంటర్ నిర్వహించే శ్రీహరితో పరిచయం ఉంది. ఈ క్రమంలో శ్రీహరి భార్య చందనతో భరద్వాజ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భరద్వాజ్... చందనను తీసుకెళ్లాడు. దీనిపై ఈ ఏడాది మార్చిలో అనంతపురం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో భరద్వాజ్‌పై కిడ్నాప్ కేసు నమోదై రిమాండ్‌కు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చందన వెంటపడుతుండటంతో శ్రీహరి, అతని బంధువులు భరద్వాజ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నారు.
ఫోన్ చేయించి .. కాపు కాసి..
కుట్రలో భాగంగా గత నెల 29న రాత్రి 10.30 గంటల సమయంలో చందనతో భరద్వాజ్‌కు ఫోన్ చేయించి ఆరాధ్య హోమ్స్ వద్దకు రప్పించారు. భరద్వాజ్ కారులో అక్కడికి చేరుకుని చందనతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా నిందితులు అతడి వాహనానికి మోటార్‌సైకిల్ అడ్డుపెట్టి కొడవలి, ఇనుపరాడ్లు, బండరాయితో దాడి చేసి హత్య చేశారు. నిందితులను పామురాయి వద్ద అక్కమ్మగార్ల గుట్ట సమీపంలో అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, కొడవలి, రెండు ఇనుపరాడ్లు, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ గుర్తించి అరెస్టు చేయడంలో సహకరించిన సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, రూరల్ మహిళా ఎస్‌ఐ చైతన్యస్వరూపిణి, ఎస్‌ఐలు ధరణిబాబు, నవీన్‌కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు మహమ్మద్ రఫీక్, రామయ్య, కానిస్టేబుళ్లు తిమ్మప్ప, ఆసిఫ్, దాస్, రాజశేఖర్, మహేంద్ర, చంద్రకళను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు.
ఆరుగురిని అరెస్టు చేసిన
పోలీసులు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం


