ఉరవకొండ: నియోజకవర్గంలో పలువురు కార్ల యజమానుల నుంచి బాడుగకు కార్లు తీసుకుని వాటిని బయట వ్యక్తులకు తాకెట్టు పెట్టి డబ్బు వసూలు చేసి పరారీలో ఉన్న మోసకారిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉరవకొండ సీఐ మహానంది, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు తెలిపిన వివరాలమేరకు... స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసమంటున్న అంకె అమరేశ్వర అలియాస్ హనుమంతు పట్టణంలో బాడుగులకు వాహనాలు తిప్పే కార్ల యజమానుల వద్దకు వెళ్లి అధిక బాడుగ చెల్లిస్తానంటూ ఆశ చూపాడని తెలిపారు. అతని మాటలు నమ్మిన కార్ల యజమానులు కార్లు బాడుగలకు ఇచ్చారన్నారు. అయితే వారికి తెలియకుండా హనుమంతు 13 కార్లను బయట వ్యక్తులకు కుదవ పెట్టి డబ్బులు వసూలు చేసి పరారైనట్లు పేర్కొన్నారు. వాహన యజమానుల్లో ఒకరైన ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సోమవారం పాల్తూరు క్రాస్ వద్ద 42వ జాతీయ రహదారి వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 9 కార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు


