గుంతకల్లు: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన మేరకు .. హనుమేష్‌నగర్‌కు చెందిన శంకర్, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే శంకర్ కొన్నేళ్ల కిందటే మృతి చెందాడు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాసులు (40) జూదానికి బానిసకావడంతో పెళ్లి కూడా చేసుకోలేదు. ఈ నేపథ్యంలో అప్పులు ఎక్కువవడంతో వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బు చెల్లించాలని వేధింపులు అధికమయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది రోటరీ హైస్కూల్ సమీపంలోని రైలు పట్టాలపై గూడ్స్ రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.


