బుక్కరాయసముద్రం: ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని హెడ్ ఆఫ్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఆమ్‌డాక్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈఎస్ చక్రవర్తి అన్నారు. సోమవారం ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఆరంభ్–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చక్రవర్తితో పాటు ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్ కల్పించేలా కళాశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నైపుణ్యాలతో కూడిన ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం పని చేస్తోందన్నారు. అనంతరం ఈఎస్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు మంచి కళాశాలను ఎంచుకోవాలని సూచించారు. ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల మంచి వాతావరణం, అధునాతన సౌకర్యాలు కల్పించిందన్నారు. 18 ఏళ్లలో ఎస్‌ఆర్‌ఐటీ న్యాక్, ఎన్‌బీఏ, (అటానమస్) స్వయం ప్రతిపత్తి గుర్తింపు పొందిందన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి, చైర్‌పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, డీన్ డాక్టర్ సాయి చైతన్య కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


