శింగనమల మండలం నాగులగుడ్డం తండాలో వర్షాలు లేక బోర్లన్నీ ఎండిపోయాయి. పది రోజులుగా వ్యవసాయ బోరు వద్దకెళ్లి తాగునీటి పట్టుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తండాలో ఉన్న బోరు బావి ఎండిపోవడంతో పెద్ద జలాలపురం ఆంజనేయస్వామి గుడి వద్ద మరో బోరు వేశారు. అయితే విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, మోటారు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో తండావాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికై నా తమ తాగునీటి కష్టాలు తీర్చాలని తండా వాసులు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


