కణేకల్లు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అటెండర్ శ్రీనివాసులు (56) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. సిబ్బంది కథనం మేరకు.. కళ్యాణదుర్గానికి చెందిన శ్రీనివాసులు అవుట్‌సోర్సింగ్ కింద అటెండర్‌గా గత 12 ఏళ్ల నుంచి మోడల్ స్కూల్‌లో పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీ కొచ్చిన శ్రీనివాసులు సుస్తీగా ఉండటంతో మెడికల్ రూమ్‌లో కూర్చున్నాడు. ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో కుప్పకూలాడు. సిబ్బంది వెంటనే సీపీఆర్ చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసులుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై ప్రిన్సిపాల్ రెహానాబేగం, ఎంపీఓ–2 భవానీశంకర్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కళ్యాణదుర్గంలో మరొకరు...
కళ్యాణదుర్గం: చాపిరి సహకార బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్న తిమ్మసముద్రం గ్రామానికి చెందిన టి.బాషా (58) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిన బాషాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య రోజాబీ, ఐదుగురు సంతానం కాగా ఇద్దరికి వివాహం అయింది. ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడు వీరి వద్దనే ఉంటున్నారు.


