అన్నాభిషేకానికి పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

అన్నాభిషేకానికి పోటెత్తిన భక్తజనం

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

ఆత్మకూరు: శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలోని శ్రీ సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర, మంజునాథ స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించారు. మొదట స్వామి వారికి పాలాభిషేకం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆకుపూజ నిర్వహించి.. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. స్వామి వారి స్వర్ణముఖ కవచానికి ఆలయం చుట్టూ పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాలసర్పదోష నివారణ, రాహుకేతు హోమాలను చేపట్టారు. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి గంటల సమయం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement