వలస కూలీల జీవనోపాధి కోసం అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. చెత్తతో సంపద తయారీ కేంద్రాల నిర్మాణంలో భారీ అక్రమాలకు పాల్పడింది. రెట్టింపు నిధులను వెచ్చించి దుర్వినియోగం చేశారు. తెలుగుదేశం నాయకులే కాంట్రాక్టర్లుగా మారి నిధులు కొల్లగొట్టారు. ఈభారీ కుంభకోణంపై విజిలెన్స్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం


