మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

బుక్కరాయసముద్రం: మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ పండుగ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ముస్లిం సోదరులకు ఇప్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అల్లాను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం ముస్లింలతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్జీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైపుల్లా బేగ్‌, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్‌ నదీం అహ్మద్‌, పొలిటికల్‌ అడ్వయిజర్‌ కమిటీ నెంబర్‌ (పీఎస్‌ సభ్యులు) ఎండీ కదిరి ఇస్మాయిల్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, నార్పల రఘునాథ్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, వీరాంజినేయులు, ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ నాయక్‌, అధికార ప్రతినిధి మారుతీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, లలితా కళ్యాణి, రాధా మనోహర్‌రెడ్డి, భోగాతి నాగేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నితిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement