● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం అర్బన్: ఈ నెల 14, 15 తేదీల్లో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ విష్ణుచరణ్ ఆదేశించారు. గుత్తికోట ఉత్సవాల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో జేసీ సమీక్షించారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలని, బందోబస్తు పటిష్టంగా ఉండాలని సూచించారు. మొబైల్ టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, క్లిన్ అండ్ శానిటేషన్ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు.సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, జిల్లా పర్యాటక అఽధికారి జయకుమార్‌బాబు, గుంతకల్లు ఆర్‌డీఓ శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


