వివరాలు IIలో
● ఆర్డీటీ కోసం పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ
కళ్యాణదుర్గం/కుందుర్పి: విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి తదితర రంగాల్లో పేదలకు ఇతోధికంగా సాయమందిస్తున్న ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం కుందుర్పిలో లక్ష పోస్టు కార్డుల కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ,, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, నియోజకవర్గ పరిశీలకుడు మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ద్వారా లక్ష పోస్టుకార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి పంపనున్నారు.


