మహిళాభ్యున్నతే లక్ష్యంగా ముందడుగు.. | - | Sakshi
Sakshi News home page

మహిళాభ్యున్నతే లక్ష్యంగా ముందడుగు..

Mar 8 2026 7:42 AM | Updated on Mar 8 2026 7:42 AM

న్యూస్‌రీల్‌

అనంతపురం: సంక్షేమ పథకాలను నేరుగా మహిళలకే అందజేసిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అనంత శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న మహిళలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో అడుగు వేయాలని ఆకాంక్షించారు. మహిళాభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. సీ్త్రలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, ఈ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆర్థికంగా చేయూతే కాకుండా లక్షలాది పేద కుటుంబాలలో వెలుగు నింపేందుకు వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల కాలంలో నవరత్నాల కింద ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని తెలియజేశారు. కానీ నేడు చంద్రబాబు పాలనలో మహిళా సాధికారత, మహిళాభ్యున్నతి, మహిళల రక్షణ అనేవి మేడిపండు చందంగా మారిపోయాయని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement