బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 13న జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం, ఉన్నత విద్యా ప్రదర్శన, తరంగ్–2కే సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆ కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ శుక్రవారం ఎస్‌ఆర్‌ఐటీలో విడుదల చేసి, మాట్లాడారు. సదస్సుకు కళాశాల చైర్ పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ రషీద్, డాక్టర్ మహేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.


