పీఎస్‌హెచ్‌ ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌హెచ్‌ ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన

Mar 7 2026 8:08 AM | Updated on Mar 7 2026 8:08 AM

యాడికి: యాడికి మండలం కమలపాడు, చింతలాయపల్లి, కుందనకోట గ్రామాల పరిసరాల్లో జల విద్యుత్‌ ఉత్పత్తి, పవర్‌ నిల్వకు సంబంధించి చేపట్టిన పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ (పీఎస్‌హెచ్‌) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జెన్‌కో అధికారులను జేసీ విష్ణుచరణ్‌ ఆదేశించారు. ఆయా గ్రామాల రైతుల అందిస్తున్న భూములను శుక్రవారం జేసీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో మ్యుటేషన్‌, ఎఫ్‌లైన్‌ దరఖాస్తులు, పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రతాపరెడ్డి, డీటీ శ్రీనివాసులు, జెన్‌కో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు ఆదినారాయణ, డిప్యూటీ ఇంజనీర్లు ఆంజనేయులు, రవి, మండల సర్వేయర్‌ శేషసాయి, వీఆర్వోలు గంగన్న, భీమేశ్వ రెడ్డి, సచివాలయ సర్వేయర్‌ మౌలాలీ పాల్గొన్నారు.

భూ సేకరణ వేగవంతం చేయండి

అనంతపురం అర్బన్‌: జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టలకు సంబంధించి భూ సేకరణ, బదలాయింపు ప్రక్రియలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే, ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ, తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ భవనం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జేసీ సమీక్షించారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుని పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. కోర్టు వివాదాలు ఉంటే త్వరతిగతిన పరిష్కరమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ పీడీ తరుణ్‌, భూ విభాగం సూపరింటెండెంట్‌ రియాజుద్ధీన్‌, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement