పశుశాఖ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్య
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ హాస్పిటల్ అటెండెన్స్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన సి.వరప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్‌ట్రస్థాయి సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడుగా గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌తో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన వరప్రసాద్‌కు అవకాశం కల్పించడంతో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా
సంతోష్
అనంతపురం అర్బన్: ఏఐవైఎఫ్ (అఖిల భారత యువజన సమాఖ్య) రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన జి.సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అభినందన సభ ఏర్పాటు చేసి సంతోష్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. యువజనుల సమస్యలపై పోరాటం చేస్తున్న సంతోష్‌కు గౌరవప్రదమైన గుర్తింపు దక్కిందన్నారు. మరింత శక్తివంతంగా పనిచేసి యువజన హక్కుల సాధనకు పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రమణయ్య, కుళాయిస్వామి, కోట్రేశ్, ధనుదేవ, శ్రీనివాస్, వెంకటనాయక్, మంజూనాథ్, చందు, సమీర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
మెగా వైద్య శిబిరానికి స్పందన
కుందుర్పి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బసాపురం గ్రామానికి చెందిన దివంగత వీఆర్‌ఓ రామలింగారెడ్డి, ఆయన భార్య దివంగత ప్రమీళ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లాయర్ మల్లారెడ్డి, శాంతకుమారి తదితరులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా 800 మందికి చిత్తూరు, అనంతపురానికి చెందిన వైద్యులు కీళ్లు, ఎముకలు, నరాలకు సంబంధించిన వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోగులకు భోజనంతో పాటు పండ్లు,మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.
పశుశాఖ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్య
పశుశాఖ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్య


