ఆర్ట్స్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సందడి
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1976 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. 1976లో సీపీజెడ్ గ్రూప్ నుంచి 21 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇక్కడ చదువుకుని 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకున్నారు. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తమ అధ్యాపకులు వాసుదేవరావు, సుబ్బన్న, మాధవరావు, కృపాకర్, శ్రీనివాస్ శెట్టి, లక్ష్మీనారాయణ తదితరులను గుర్తు చేసుకున్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన డి. ప్రవీణ జిల్లా జడ్జిగా పనిచేసి ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా ఉండటం తమకు గర్వంగా ఉందన్నారు.
2006–2008 బ్యాచ్ విద్యార్థులు..
2006 నుంచి 2008 వరకు బయో కెమిస్ట్రీ విభాగంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ బ్యాచ్‌కు చెందిన మోహన్ బాబు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. డాక్టర్ మారుతి హర్యానాలోని సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్‌ఓడీగా, శివాజీ, రవికుమార్, సురేంద్ర, వన్నూరు స్వామి ప్రభుత్వ కొలువుల్లో క్రియాశీలక పదవుల్లో ఉన్నట్లు తెలిపారు. 2007 బ్యాచ్ గణేష్, తిరుమణి సచివాలయాల్లో పని చేస్తున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన గోపాల్ కంటి వైద్య సహాయ నిపుణుడిగా సేవలందిస్తున్నాడు. మురళీకృష్ణ, శివకృష్ణ, ఫ్యాన్సీ ప్రియాంక, ఉచ్చురప్ప, ఓబుల్ రెడ్డి ప్రభుత్వ సంస్థల్లో క్రియాశీలక పదవుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా గురువులు ధనుంజయ, జీఎల్‌ఎన్ ప్రసాద్, శివచంద్ర, పద్మశ్రీలను సన్మానించారు.
ఆర్ట్స్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సందడి


