వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవం
లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తున్న దృశ్యం
ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తీసుకెళుతున్న భక్తులు
బొమ్మనహాళ్ మండలంలోని ఉప్పరహాళ్‌లో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవం శనివారం వేలాది భక్తుల నడుమ వైభవంగా సాగింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా ఉద్దేహళ్ సమీపంలోని వేదవతి హగరి నదికి తీసుకెళ్లారు. నది జలాలతో స్నానాదులు చేయించిన అనంతరం విశేష అలంకరణతో సాయంత్రం వరకూ అక్కడే కొలువుదీర్చారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో రాత్రంతా ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. – బొమ్మనహాళ్
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవం
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవం


