జేవీవీ పోరాట పటిమ మరింత పెరగాలి
అనంతపురం కల్చరల్: సమాజంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను తొలగించడంతో పాటు శాసీ్త్రయ దృక్పథఽ సమాజ నిర్మాణంలో జేవీవీ మరింత పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర నేత చంద్రశేఖర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం రాత్రి అనంతపురంలోని ఎన్జీఓ హోమ్‌లో నిర్వహించారు. చంద్రశేఖర్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, డాక్టర్ కొండయ్య, తరిమెల అమరనాథరెడ్డి మానవ హక్కుల సంఘం ఎస్‌ఎం బాషా తదితరులు మాట్లాడారు. దేశంలో మతోన్మాదం బాగా పెరిగిపోతోందని, ఇలాంటి తరుణంలో సమాజంలో అందరూ మానవులే అనే స్పృహను రగిలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు తరగతి గదిని ఆలంబనగా మార్చుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీర్రాజు, నాయక్, రాజ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
3న పెన్నహోబిలం
ఆలయం మూసివేత
ఉరవకొండ రూరల్: ఈ నెల 3న చంద్ర గ్రహణం కారణంగా పెన్నహోబిలంలోని లక్ష్మీనరిసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ తిరుమలరెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు ద్వారాలు మూసి వేయనున్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
సరస్వతీ కటాక్షం కలగాలి
అనంతపురం ఎడ్యుకేషన్: తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులందరిపై సరస్వతీ కటాక్షం కలగాలని సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఆకాంక్షించారు. శనివారం అనంతపురంలోని కృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కార్మిక సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ((ఏపీబీఓసీడబ్ల్యుడబ్ల్యుబీ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నాలుగు రకాల పథకాలకు అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్, మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్, సాధారణ డెత్ రిలీఫ్ స్కీమ్, ఫెనరల్ ఎక్స్‌పెన్షస్ స్కీమ్‌లకు సంబంధించి ఈ నెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాలకు అనంతపురంలోని సహాయ కార్మిక అధికారి–1 (94925 55190), సహాయ కార్మిక అధికారి–2 (94925 55191), గుత్తి (94925 55192), గుంతకల్లు (94925 55193), తాడిపత్రి(94925 55192), రాయదుర్గం (94925 55199) నంబర్లలో సంప్రదించి, దరఖాస్తులను ఆయా కార్యాలయాల్లో అందజేయాలి.
సెంట్రల్ వర్సిటీలో
జాతీయ సదస్సు
అనంతపురం: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఏపీలో మానసిక శాస్త్ర విభాగంలో ‘న్యూరో సైకాలజికల్ అసెస్‌మెంట్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అంశంపై శనివారం జాతీయ సదస్సు జరిగింది. వర్సిటీ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ సి.షీలారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్‌బీ కివడే, మానసిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆకృతి శ్రీవాస్తవ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెల్లీ కావ్య, క్లినికల్ సైకాలజిస్ట్ ఎస్.సమర్పిత తదితరులు ప్రసంగించారు. భావోద్వేగాలు, ప్రవర్తనల మధ్య ఉన్న సంబంధాన్ని విశదీకరించారు.
జేవీవీ పోరాట పటిమ మరింత పెరగాలి
జేవీవీ పోరాట పటిమ మరింత పెరగాలి


