కళ్యాణదుర్గంలో అరుదైన ఘటన | - | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో అరుదైన ఘటన

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

కళ్యాణదుర్గంలో  అరుదైన ఘటన

కళ్యాణదుర్గంలో అరుదైన ఘటన

కళ్యాణదుర్గం రూరల్‌: మండలంలోని మల్లికార్జునపల్లిలో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్‌ టీచర్‌గా పనిచేస్తున్న భ్రమరాంబ ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం అభినందన, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా అనూహ్యంగా ఆమెకు విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత ఉపాధ్యాయుడు బండయ్య మాస్టర్‌ అక్కడ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. 103 ఏళ్ల వయసున్న ఆయన తన శిష్యురాలిని సన్మానించి, ఆశీర్వదించారు. దశాబ్దాల క్రితం పాఠాలు చెప్పిన గురువు చేతుల మీదుగా సన్మానం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని భ్రమరాంబ పేర్కొన్నారు. అనంతరం బండయ్య మాస్టర్‌ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement