వైఎస్‌ జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

వైఎస్‌ జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం

వైఎస్‌ జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌

శింగనమల/బుక్కరాయసముద్రం: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌ జగన్‌ హయాంలోనే న్యాయం చేకూరిందని, వైఎస్సార్‌సీపీలోనూ ఆయా వర్గాలకు అధిక ప్రాధాన్యతినిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ అన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ శ్రేణులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ వేదాంతం నాగరత్నమ్మ, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, మిద్దె కుళ్లాయప్ప, జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు, నియోజకవర్గ అధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సర్పంచ్‌ పార్వతి, ఆరు మండలాల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ప్రభుదాస్‌, మారుతి, నీలకంఠ నారాయణస్వామి, సూర్యనారాయణ, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement