నెట్టికంటుడి టేకు ప్రతిమ ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

నెట్టికంటుడి టేకు ప్రతిమ ఊరేగింపు

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

నెట్టికంటుడి టేకు ప్రతిమ ఊరేగింపు

నెట్టికంటుడి టేకు ప్రతిమ ఊరేగింపు

గుంతకల్లు రూరల్‌: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో నూతనంగా ప్రతిష్టించనున్న స్వామి వారి ప్రతిమను శుక్రవారం ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. రాతితో గర్భాలయాన్ని నిర్మించనున్న నేపథ్యంలో మూలవిరాట్‌ దర్శనాన్ని పూర్తిగా నిలిపి వేయనున్నారు. దీంతో ధ్వజ స్తంభం వద్ద టేకుతో తయారు చేయించిన స్వామి వారి ప్రతిమను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

హుండీ కానుకల లెక్కింపు

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 29 రోజులకుగానూ రూ. 25,56,798 నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.92,260 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ ఎం.విజయరాజు తెలిపారు. అలాగే 18.240 గ్రాముల బంగారు, 910 గ్రాముల వెండితో పాటు 3 అమెరికన్‌ డాలర్లును భక్తులు సమర్పించారు. లెక్కింపు ప్రక్రియలో కసాపురం వాసులు, గుంతకల్లు హనుమాన్‌ సేవా సమితి, కర్నూలు బాలాజీ సేవా సమితి, నంద్యాల శ్రీరామ సేవా సమితి, బళ్లారి వీరభద్రసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు, పోలీసులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement