●పెన్నమ్మకు గర్భశోకం
పామిడి పెన్నానదిలో అక్రమంగా వెలసిన వరిమళ్లు
ఒకప్పుడు ఇసుక దిన్నెలతో కళకళలాడిన పామిడి పెన్నానదిలో ‘పచ్చ’ తోడేళ్లు సై’ఖతం’ చేస్తున్నాయి. దీనికి తోడు ఆక్రమణలు పెరిగిపోయాయి. ఎటు చూసినా వరిమళ్లు, తోటలు, ఇటుకబట్టీలు వెలిశాయి. దీంతో పెన్నానది రూపురేఖలు మారిపోయి గర్భశోకంతో అల్లాడిపోతోంది. ఇసుక అక్రమ రవాణాతో నదిలో ఎక్కడికక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి తరచూ తాగునీటి సమస్యతో పామిడి వాసులు విలవిల్లాడుతున్నారు. దశాబ్దాల క్రితం కేవలం పది అడుగుల లోతులోనే అపారమైన భూగర్భ జలాలు లభ్యమయ్యేవి. నేడు వందల అడుగుల లోతు బోరు బావులు తవ్వినా ఫలితం దక్కడం లేదు. పామిడిలోని సర్వే నంబర్ 1247లో 961.18 ఎకరాల్లో విస్తరించిన పెన్నానదిలో 410 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆక్రమణల తొలగింపుపై అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు దృష్టి సారించకపోతే పెన్నానది కనుమరుగయ్యే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – పామిడి:
నది మధ్య భాగంలో వెలసిన ఇటుకల బట్టీలు
నది మధ్య భాగంలో సాగులో ఉన్న పూల తోటలు
టీడీపీ నేతల ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడిన గోతులు
●పెన్నమ్మకు గర్భశోకం
●పెన్నమ్మకు గర్భశోకం
●పెన్నమ్మకు గర్భశోకం


