అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
● వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నాయకులు
అనంతపురం ఎడ్యుకేషన్: అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అరెస్ట్‌ను నిరసిస్తూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎద్దుల నవీన్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండా దాటవేత దోరణి అవలంభిస్తోందన్నారు. కక్ష సాధింపు చర్యలతో జైల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్‌కు దమ్ముంటే విద్యార్థులకు ఇవాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని సవాల్ విసిరారు. అలా కాదని ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రశ్నిస్తానన్న డీసీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికై నా మౌనం వీడి విద్యార్థుల పక్షాన నిలవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పులి కార్తికేయ, హరీష్, చరణ్, కృష్ణ, లోకేష్, కార్తీక్, బాబా ఇమ్రాన్, కార్తీక్, నంద, విజయ్, సంతోష్ రెడ్డి, బబ్లూ, సాయి, వడ్డే ప్రవీణ్, శివ, సాయి, నాగేంద్ర, రాజా, సుధీర్, అనిల్, బాబా ఇమ్రాన్, సూర్య పాల్గొన్నారు.


