మసకబారుతున్న రాయల వైభవం
పెనుకొండ: పురావస్తు శాఖ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పెనుకొండలో రాయల వైభవం మసకబారుతోంది. శ్రీకృష్ణదేవరాయల వైభవానికి ప్రతీకగా పెనుకొండలో నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన గగన్ మహల్ పశువుల దొడ్డిగా మారింది. రోజూ గగన్‌మహల్‌లోకి పశువులు చొరబడి పర్యాటకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కనీసం గగన్ మహల్ మెయిన్ గేటుకు తాళం వేసేవారు కూడా లేరు. ఇప్పటికే పెనుకొండలో ఎన్నో చారిత్రక కట్టడాలు సరైన ఆలనాపాలనా లేక కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల గగన్‌మహల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికై నా పురావస్తు శాఖ అధికారులు స్పందించి గగన్‌మహల్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మసకబారుతున్న రాయల వైభవం


