
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం
● మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్
అనంతపురం టవర్‌క్లాక్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ అన్నారు. అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య విబేధాలు రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జూలుకుంట కేశవ ప్రసాద్, అరవింద్ కుమార్, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.