
దివ్యాంగుల ఉసురు తగలక మానదు
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ములేక దివ్యాంగుల పింఛన్లను తొలగించేందుకు సిద్ధమైన కూటమి సర్కార్‌కు వారి ఉసురు తగిలి తీరుతుందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే 4.15 లక్షల వృద్దాప్య పింఛన్లు తొలగించి అర్హులకు అన్యాయం చేసిందన్నారు. తాజాగా మరో 2 లక్షల దివ్యాంగుల పింఛన్లను తొలగించేందుకు కుట్ర సాగుతోందన్నారు. వైద్యులకు టార్గెట్ ఇచ్చి పింఛన్ల తొలగింపునకు సిద్ధమైన ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామన్నారు.