హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా? | - | Sakshi
Sakshi News home page

హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా?

Aug 23 2025 2:37 AM | Updated on Aug 23 2025 2:37 AM

హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా?

హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా?

అనంతపురం కార్పొరేషన్‌: ‘దివంగత ఎన్‌టీఆర్‌ కోడలు, నందమూరి హరికృష్ణ సతీమణి, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎన్‌టీఆర్‌ స్థాపించిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు.. వరుసకు సోదరి అయిన జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తల్లిపై వ్యాఖ్యలు చేస్తే స్పందించరా? తోటి నటుడి తల్లిని అవమానిస్తే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నోరుమెదపరా?’ అని వైఎస్సార్‌ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల అరాచకాలు తారస్థాయికి చేరాయని, మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడడం, వ్యవహరించడం కళ్లారా చూస్తున్నామన్నారు. జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తల్లిని ఉద్దేశించి ఎమ్మెల్యే దగ్గుపాటి దారుణంగా మాట్లాడారన్నారు. అయినా ఇలాంటి వారిని సీఎం ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. ‘నేను కొట్టినట్టు కొడతా..మీరు ఏడ్చినట్టు ఏడ్వండి’ అన్న చందంగా బాబు తీరు ఉందన్నారు. ఇటీవల అనంతపురంలో ఓ మైనార్టీ మహిళను కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి దుర్భాషలాడారన్నారు.

బాబూ కొడుకులకు కోట్లు గుమ్మరించారట

టికెట్‌ కోసం సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు రూ.కోట్లు గుమ్మరించామని, ఇప్పుడు ఆ డబ్బు సంపాదించుకోవడం తమ హక్కు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే అనంతపురంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరాయన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

దివ్యాంగులతో కలెక్టరేట్‌ ముట్టడిస్తాం

కూటమి ప్రభుత్వం జిల్లాలో 9,601 మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించి విశ్వాసఘాతుకానికి పాల్పడిందని అనంత మండిపడ్డారు. పింఛన్లను పునరుద్ధరించకపోతే దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులతో కలసి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మేయర్‌ వసీం, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్‌, ఓబిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్‌ కమల్‌భూషణ్‌, నాయకులు తనీష, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, చిదంబర్‌రెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు.

జూనియర్‌ ఎన్‌టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు దుర్మార్గం

సాటి నటుడి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్‌ కల్యాణ్‌ స్పందించరా?

ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement