
యాంటీ బయాటిక్స్ వాడొద్దు
రెస్పరేటరీ వైరల్ ఫీవర్స్, దోమకాటు ఫీవర్స్ అధికంగా వస్తున్నాయి. ప్రజలు భయపడాల్సిన పనిలేదు. కానీ సురక్షిత ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్తలు తప్పకపాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి. మాస్క్ ధరించడం, అవసరమైనప్పుడు చేతులకు శానిటైజ్ చేసుకోవాలి. జ్వరం వచ్చింది కదా అని, అనవసరంగా యాంటీ బయాటిక్స్ జోలికి వెళ్లొద్దు. పండ్లు, తదితర మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. స్వచ్ఛమైన నీటిని రోజూ ఆరు గ్లాసులపైగా తాగాలి. మూడు రోజుల కంటే అధికంగా జ్వరం ఉంటే వైద్యుల సూచనలతో రక్త పరీక్షలు చేసుకోవాలి.
– డాక్టర్ యాసర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజనాస్పత్రి