
నాడీవ్యవస్థ పనితీరు మందగిస్తుంది
గంజాయి, హెరాయిన్, ఫోర్ట్‌విన్ ఇంజెక్షన్‌లు, కొకై న్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకుంటే నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కండరాలు, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది, అసహనం, కుంగుబాటు, బరువు తగ్గిపోవడం వంటి రుగ్మతల బారిన పడతారు.
– మదన్‌కుమార్, వైద్యనిపుణులు, కదిరి
ప్రత్యేక టీములు ఏర్పాటు చేశాం
గంజాయితో పాటు ఇంకా ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేశాం. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కదలికలు, అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలి.
– వి.రత్న, ఎస్పీ, శ్రీసత్యసాయి జిల్లా