
బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్
● నేటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేళాలు
అనంతపురం సిటీ: ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సంస్థ కేబుల్ ఆపరేటర్ల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్ పాషా గురువారం వెల్లడించారు. రూ.400కే సరికొత్త ట్రిపుల్ ప్లే (ఎఫ్‌టీటీహెచ్) ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు వివరించారు. 20 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, 400+ఫ్రీ చానళ్లతో పాటు అన్ని తెలుగు పే ఛానళ్లు (44 ఛానళ్లు) వీక్షించవచ్చని వెల్లడించారు. ఈ ప్లాన్‌లో తొమ్మిది ఓటీటీలు ఉన్నాయన్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌లో టిప్‌గా నమోదు చేసుకుని ఇప్పటికే ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ కస్టమర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్చవచ్చని పేర్కొన్నారు. కొత్త ఫైబర్ కనెక్షన్లను కూడా అందించే అవకాశముందన్నారు. ఆసక్తి ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్లు అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, కదిరి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రిలో తమకు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ డివిజనల్ కార్యాలయాల్లో కానీ, అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో కానీ సంప్రదించవచ్చన్నారు. కేబుల్ ఆపరేటర్ల సౌకర్యార్థం శుక్రవారం నుంచి పైన తెలిపిన డివిజన్ కార్యాలయాల్లో టిప్/లోకల్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.