
అవసరమైన మేరకే ఎరువులు వాడాలి
● కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
కళ్యాణదుర్గం/ కళ్యాణదుర్గం రూరల్: అవసరమైన మేరకే పంటలకు రసాయన ఎరువులు ఉపయోగించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని డీసీఎంఎస్ ఎరువుల గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడారు. రైతు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బయటి మార్కెట్ కంటే డీసీఎంఎస్‌లో ఎరువులు తక్కువ ధరతో లభిస్తాయని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీతో అంది స్తున్న ఎరువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి సాగును అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్‌కుమార్ కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లిలో జవహర్ నవోదయ విద్యాలయం కోసం భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఆర్డీఓ వసంత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజి నీరింగ్ కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్‌ను బుధవారం సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ హబ్‌లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య, పలు ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
డిగ్రీ ప్రవేశాలకు
దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యూజీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కేసీ సత్యలత ఓ ప్రకటన విడుదల చేశారు.బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 26 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రైల్వే డివిజన్‌ను అభివృద్ధి
పట్టాలపై నడుపుదాం
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్‌ను అభి వృద్ధి పట్టాలపై నడపడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తాతో కలిసి గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రేణిగుంట–గుంతకల్లు సెక్షన్‌లో ప్రత్యేక రైలులో పర్యటిస్తూ తనిఖీ చేశారు. సాయంత్రం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో రివ్యూ మీటింగ్‌లో జీఎం మాట్లాడారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
వేడి పాలు ముక్కులో పడి చిన్నారి మృతి
గుత్తి: వేడి పాలు ముక్కులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన పట్టణంలో విషాదం నింపింది. వివరాలు.. స్థానిక కోట వీధిలో నివసిస్తున్న ప్రతాప్ రెడ్డి, మేనక దంపతులకు ఇద్దరు మగపిల్లలు (కవలలు) సంతానం. కుమారులను తల్లిదండ్రులు ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నారు. బుధవారం ఇంట్లో పెద్ద కుమారుడు (15 నెలలు) శర్విల్ రెడ్డి గిన్నెలో ఉన్న వేడి పాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వేడి పాలు చిన్నారి ముక్కు, నోట్లో పడ్డాయి. దీంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న శర్విల్ రెడ్డిని వెంటనే తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక చిన్నారి మృతి చెందాడు. బిడ్డ మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అవసరమైన మేరకే ఎరువులు వాడాలి

అవసరమైన మేరకే ఎరువులు వాడాలి