
బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం: ఏపీ ప్రభుత్వం 2025–28 సంవత్సరానికి గాను జిల్లాలో 19 బార్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఉన్న బార్‌ల గడువు ముగిసిందని, వీటి స్థానంలో కొత్త బార్‌లు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 9, గుంతకల్లులో ఒకటి, తాడిపత్రిలో 4, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గంలో ఒక్కొక్కటి చొప్పున బార్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వేలం పద్ధతిలో కాకుండా, లక్కీ డ్రా ఆధారంగా కేటాయిస్తామన్నారు. నాన్ రీఫండబుల్ కింద దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. బార్ కేటాయిస్తే ఏడాదికి రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజు, రూ.10 వేలు ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు మొత్తాన్ని నిర్ధేశించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఈ నెల 26వ తేదీలోపు ఆన్‌లైన్ /హైబ్రిడ్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 28న కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహిస్తారన్నారు.