
పదాలు అవసరం లేదు.. ఒక్క ఫొటో చాలు!
ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదులాడుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే నాటి స్మృతులు మనసులో మెదలుతాయి. సంతోషం.. బాధ.. మధుర ఘట్టాలు.. సాధించిన విజయాలు.. అద్భుత సన్నివేశాలు.. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఒక్క ఫొటోతోనే సాధ్యం. మనసులోని భావాలను పలికించడానికి.. ప్రకృతి అందాలను బంధించడానికి.. హృదయాంతరాల్లోని ఆర్ధ్రతను చూపించడానికి.. ప్రజల ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడానికి పదాలు అవసరం లేదు. ఒక్క చిత్రం చాలు. ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన లూయిస్ డాగురే జ్ఞాపకార్థం ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాలు మీకోసం.. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

పదాలు అవసరం లేదు.. ఒక్క ఫొటో చాలు!

పదాలు అవసరం లేదు.. ఒక్క ఫొటో చాలు!

పదాలు అవసరం లేదు.. ఒక్క ఫొటో చాలు!

పదాలు అవసరం లేదు.. ఒక్క ఫొటో చాలు!