
బైక్ ఢీకొని బాలుడి మృతి
గుమ్మఘట్ట: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామానికి చెందిన వీరాంజనేయులు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆదివారం ఉదయం పెద్ద కుమారుడు కార్తీక్ (5)ను పిలుచుకుని రోడ్డు పక్కన ఉన్న తోటలోకి వెళ్లారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా.. కార్తీక్ రోడ్డుపైకి చేరుకున్నాడు. అదే సమయంలో రంగచేడు వైపు నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం వేగంగా వెళుతూ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహాన్ని హత్తుకుని గుండెలవిసేలా రోదించారు. ఘటనపై రాయదుర్గం రూరల్ పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
శతాధిక వృద్ధురాలి మృతి
కూడేరు: మండలంలోని ఇప్పేరుకు చెందిన అచ్చుత బాలయ్య సతీమణి లక్ష్మీదేవమ్మ (102) కన్నుమూశారు. ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బెంగళూరులో కుమారుడి వద్ద ఉంటున్న ఆమె వయోభారంతో ఆదివారం మృతి చెందారు.

బైక్ ఢీకొని బాలుడి మృతి